Assembly: హరీశ్ రావుతో రాజాసింగ్.. అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం..

by Prasad Jukanti |

తెలంగా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

Assembly: హరీశ్ రావుతో రాజాసింగ్.. అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ సభ్యులతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) కలవడం ఆసక్తిగా మారింది. ఇవాళ ఉదయం సభ ప్రారంభానికి ముందు లాబీలో రాజాసింగ్ ముందు వెళ్తుండగా వెనుక నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వచ్చారు. ఈ సందర్భంగా ముందు వెళ్తున్న రాజాసింగ్ తన వెనుక వస్తున్న హరీశ్ రావు (Harish Rao), బీఆర్ఎస్ సభ్యులను కలిసి వారితో పాటు ముందుకు కదిలారు. కాగా ఇటీవలే బీజేపీకి రాజాసింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కిషన్ రెడ్డి, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుపై రాజాసింగ్ తరచు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ పార్టీని సొంత పార్టీ నేతలో నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే బీజేపీకి గుడ్ బై చెప్పిన రాజాసింగ్ త్వరలోనే మరో పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, జనసేన వంటి పార్టీలలో ఏదో ఒకదాంట్లో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. రాజాసింగ్ బీఆర్ఎస్ సభ్యులతో కలవడం రాజకీయవర్గాల్లో ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Next Story