పార్టీ మార్పుపై రాజగోపాల్ రెడ్డి సైలెంట్?

by Disha Web Desk 12 |
పార్టీ మార్పుపై రాజగోపాల్ రెడ్డి సైలెంట్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ మార్పుపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు. పార్టీ మారుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా.. ఇప్పటి వరకు ఖండించలేదు. కాగా, రీ జాయిన్ కావాలని కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందినట్లు తెలిసింది. అయితే ఆయన ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డి అంశంపై ఇటీవల వెంకట్ రెడ్డి కూడా ఢిల్లీలో ప్రియాంక గాంధీతోనూ చర్చించినట్లు తెలిసింది. ఘర్ వాపసీలో భాగంగా పార్టీ వీడిన నేతలందరినీ ఆహ్వానించాలని ఆమె సూచించడంతో ఇప్పుడు టీపీసీసీ అదే పనిలో నిమగ్నమైంది.

అయితే రాజగోపాల్ రెడ్డికి ఆహ్వానం అందినా... కాస్త డైలమాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసి రాజీనామా చేశారు. పార్టీలో మళ్లీ తిరిగి చేరాలంటే ‘టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి’ అని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ సారీ చెబితేనే పార్టీలో చేరుతారా? చేరినా పార్టీలో ప్రాధాన్యత ఎలా ఉంటుందోనని రాజగోపాల్ రెడ్డి టెన్షన్ పడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

మునుగోడు టికెట్ వస్తుందా?

రాజగోపాల్ రెడ్డి పార్టీ మారినా.. మళ్లీ మునుగోడు నుంచి టికెట్ వస్తుందా? అనేది కూడా అనుమానమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తో మునుగోడు ప్రజలకు న్యాయం జరగలేదని ప్రచారం చేసిన రాజగోపాల్ రెడ్డి మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేస్తే జనాలను కన్విన్స్ చేయడం కష్టమే. నాయకుడు ఎటు మారితే అటు ఓట్లు వేయడం కూడా అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. ఒక వేళ రాజగోపాల్ రెడ్ది మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తే మునుగోడు కాకుండా ఇతర సెగ్మెంట్ లేదా పార్లమెంట్ స్థానాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి ఇప్పటి వరకు నోరు మెదపకపోవడంలో రాజకీయ వర్గాల్లో వివిధ రకాల ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి.


Next Story

Most Viewed