- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమర్నాథ్ యాత్రలో రాజాసింగ్... బీజేపీపై హాట్ కామెంట్స్ !
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) అమర్నాథ్ యాత్రలో (Amarnath Yatra) మెరిశారు. ఇటీవల ప్రారంభమైన అమర్నాథ్

దిశ, వెబ్ డెస్క్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) అమర్నాథ్ యాత్రలో (Amarnath Yatra) మెరిశారు. ఇటీవల ప్రారంభమైన అమర్నాథ్ యాత్రకు... రాజాసింగ్ కుటుంబ సమేతంగా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అక్కడికి వెళ్లినప్పటికీ కూడా.. ఓ వీడియో ద్వారా ప్రజలకు కీలక సందేశాన్ని పంపారు. అమర్నాథ్ యాత్రలో హిందువులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్నాథ్ యాత్ర చాలా సులభం అయిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు రాజా సింగ్. యాత్ర మార్గంలో రోడ్డు సహా అన్ని మార్గాలు సమకూరాలని వెల్లడించారు. అమర్నాథ్ యాత్ర కు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ముస్లింలకు ఉపాధి దొరికిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా... తెలంగాణ రాష్ట్ర బీజేపీ పరిస్థితుల నేపథ్యంలో.. ఇటీవల ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు. తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి పై ఆశపెట్టుకున్న రాజా సింగ్ కు అధిష్టానం మొండి చేయి చూపించింది. రామచంద్రరావుకు ఆ పదవి దక్కడంతో... బిజెపి పార్టీకి రాజీనామా చేశారు రాజా సింగ్.






