తన రాజీనామా ఆమోదంపై స్పందించిన రాజాసింగ్.. మరో సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-11 10:58:10  IST  )

తన రాజీనామాను బీజేపీ(BJP) అధిష్టానం ఆమోదించడంపై ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) స్పందించారు. ‘ఉత్తరఖండ్ నుంచి వీడియో విడుదల చేశారు.

తన రాజీనామా ఆమోదంపై స్పందించిన రాజాసింగ్.. మరో సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తన రాజీనామాను బీజేపీ(BJP) అధిష్టానం ఆమోదించడంపై ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) స్పందించారు. ‘ఉత్తరఖండ్ నుంచి వీడియో విడుదల చేశారు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరాను. నన్ను నమ్మి పార్టీ మూడుసార్లు టికెట్ ఇచ్చింది. ఇన్ని రోజులు నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకూ హిందూత్వం, సనాతనధర్మం కోసం పోరాటం చేస్తా. జాతీయ వాదం కోసం పనిచేస్తా’ అని రాజాసింగ్ ప్రకటన చేశారు.

కాగా, రాజాసింగ్ రాజీనామాను శుక్రవారం ఆ పార్టీ అధిష్టానం ఆమోదించింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు రాజాసింగ్‌ రాజీనామాను ఆమోదించామని, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక విషయంలో అలిగిన రాజాసింగ్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ అందజేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసేందుకు తనను అనుమతించలేదని, అందుకే రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు.

Next Story