- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Raithu Bharosa: అన్నదాతలకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల
సంక్రాంతి పండుగల వేళ అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి (Sankranthi) పండుగల వేళ అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం (State Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఇవాళ ‘రైతు భరోసా’ (Raithu Bharosa) పథకానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఎకరాకు రూ.12వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో సర్కార్ జమ చేయనున్నారు. అయితే, భూ భారతి (Bhu Bharathi)లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం అందనుంది. భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు ‘రైతు భరోసా’ (Raithu Bharosa) పథకం వర్తించనుంది. అదేవిధంగా ఆర్‌వోఎఫ్ఆర్ (ROFR పట్టాదారులకు కూడా సాయం అందనుంది. సాగుకు యోగ్యం కాని భూములను ‘రైతు భరోసా’ నుంచి తొలగించనున్నారు. భూ ఫిర్యాదుల పరిష్కారం పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్ల (District Collectors)కు అప్పగించనున్నారు. కాగా, ‘రైతు భరోసా’ ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగు (Telugu)లో విడుదల చేయడం విశేషం.






