- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో రానున్న 3 మూడు రోజుల పాటు వర్షాలు
రాష్ట్రంలోని రైతులకు హైదరాబాద్ వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని రైతులకు హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) గుడ్‌న్యూస్ చెప్పింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని కారణంగా నైరుతి ఋతుపవనాలు విస్తరించి రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.
ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, హైదరాాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
కాగా, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాజెక్టులు గేట్లు తెరిచి అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీంతో సాగునీటికి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.






