తెలంగాణకు అలర్ట్..మరో రెండు గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం

by Ajay Maddhiboyina |

తెలంగాణ‌లో వాతావ‌రణం గ‌త రెండు మూడు రోజులుగా వేడిగా ఉంటోంది. సాయంత్రం వేళ‌ల్లో చ‌ల్ల‌బ‌డినా మ‌ధ్యాహ్నం మాత్రం చాలా ప్రాంతాల్లో ఉక్క‌పోత‌తో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

తెలంగాణకు అలర్ట్..మరో రెండు గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ‌లో వాతావ‌రణం గ‌త రెండు మూడు రోజులుగా వేడిగా ఉంటోంది. సాయంత్రం వేళ‌ల్లో చ‌ల్ల‌బ‌డినా మ‌ధ్యాహ్నం మాత్రం చాలా ప్రాంతాల్లో ఉక్క‌పోత‌తో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. కాగా మ‌రో రెండు గంట‌ల్లో వ‌ర్షం కురుస్తుంద‌ని తెలంగాణ వెద‌ర్ మ్యాన్ గుడ్ న్యూస్ చెప్పాడు. రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొన్నాడు. ముఖ్యంగా సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెద‌క్, కామారెడ్డి, హ‌న్మ‌కొండ‌, వ‌న‌ప‌ర్తి, నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని ప్ర‌క‌టించాడు. వెస్ట్ తెలంగాణ‌లో సాయంత్రం వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నాడు. అంతే కాకుండా హైదరాబాద్ లోనూ ప‌లు ప్రాంతాల్లో సాయంత్రం వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేశాడు.

Next Story