- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాలకు వరుణుడి చల్లని కబురు.. రాబోయే 3 రోజులు జల్లులే జల్లులు!
రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.

దిశ, డైనమిక్ బ్యూరో: వేసవి తాపంతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
తెలంగాణ వాతావరణ నివేదిక..
మరాత్వాడ నుంచి కర్ణాటక తీరం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షం పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని సూచించింది. రానున్న రెండు రోజులు పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నప్పటికీ, ఆ తదుపరి నాలుగు రోజుల్లో మాత్రం సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఎండలు పెరిగే అవకాశం ఉందని వివరించింది.
ఆంధ్రప్రదేశ్ వాతావరణ నివేదిక..
దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఏపీ, యానాంలో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. శుక్రవారం వాతావరణం పొడిగా ఉన్నా, ఆ తర్వాత రెండు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కోస్తాంధ్ర, యానాంలో రాబోయే రెండు రోజులు ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదు, కానీ ఆ తర్వాత 3 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని, రాయలసీమలో మాత్రం వచ్చే 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు నిలకడగానే ఉంటాయని వివరించింది.






