- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామారెడ్డి వద్ద కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్.. వర్షాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా
మెదక్ (Medak), కామారెడ్డి (Kamareddy) జిల్లాలపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: మెదక్ (Medak), కామారెడ్డి (Kamareddy) జిల్లాలపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రెండు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేశారు. నేషనల్ హైవే 44 పరిధిలో భిక్నూర్ (Bhiknur) సమీపంలో ఉన్న టోల్‌ప్లాజా వరద నీటితో నిండిపోయింది. అదేవిధంగా కామారెడ్డి (Kama Reddy)లో సికింద్రాబాద్ (Secunderabad)-మన్మాడ్ (Manmad) రైల్వే ట్రాక్‌లు వర్షానికి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆ రూట్లో రైలు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అదేవిధంగా కామారెడ్డి టౌన్‌ను లింక్ చేసే చిన్న రహదారులు అన్నీ వర్షానికి కొట్టుకుపోయాయి. రాబోయే మరికొన్ని గంటల్లో కామారెడ్డి, మెదక్‌లలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఉపద్రవం వచ్చినా సహాయక చర్యలు చేపట్టేందుకు వారు సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా..
భారీ వర్షాలతో కామారెడ్డి (Kamareddy) జిల్లాలో పలు గ్రామాలు నీట మునగడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరా తీశారు. ఈ మేరకు ఆయన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట ఘటనపై జిల్లా కలెక్టర్ (District Collector)కు ఫోన్ చేసి ప్రమాద బాధితులను ఆదుకునేందుకు NDRF సిద్ధంగా ఉందని, ఏ క్షణానైనా సాయం చేయాలని వారిని ఆదేశించారు. అనంతరం బండి సంజయ్ NDRF అధికారులతో కూడా మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌తో సమన్వయం చేసుకుని సహాయ చర్యల్లో నిమగ్నమవ్వాలని వారికి సూచించారు.






