- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
KTR : రాహుల్ జీ.. అశోక్ నగర్‌కు మళ్లీ రండి.. కేటీఆర్ సంచలన ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్ అశోక్ నగర్‌లో నిరుద్యోగ యువకులను కలిసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత చేసిన ఓ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. హలో రాహుల్ గాంధీ జీ, తెలంగాణ యువత మీరు చెప్పిన ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారన్నారు. అయితే 8 నెలల తర్వాత కాంగ్రెస్ విడుదల చేసిన ‘జాబ్ లెస్ క్యాలెండర్, జీరో ఉద్యోగాల కారణంగా యువత ఆందోళన బాట పట్టారని తెలిపారు.
మీరు ఎందుకు మళ్లీ హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌కు వచ్చి అదే యువతను కలిసి మీరిచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారో చెప్పొచ్చు కదా అని సూచించారు. రాహుల్ చేసిన ట్వీట్‌లో ‘తెలంగాణ యువత దొరల కేసీఆర్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతోందని.. తన అశోక్ నగర్ పర్యటన తర్వాత ఈ విషయం స్పష్టమైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వారి సమస్యను పరిష్కరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. దీంతో పాటు ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు, టీపీఎస్సీని యూపీఎస్సీలా పునరుద్ధరిస్తామని తెలిపారు. యువ వికాసం పథకం కింద 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. యువత ప్రజాపాలన సాగించే కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని ఇదే నా గ్యారంటీ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ కేటీఆర్ తాజాగా ఘాటుగా స్పందించారు.