Bandi Sanjay : ఆరు గ్యారంటీలపై సమాధానం చెప్పాకే రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలి : కేంద్ర మంత్రి బండి సంజయ్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-05 08:49:20.0  )
Bandi Sanjay : ఆరు గ్యారంటీలపై సమాధానం చెప్పాకే రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలి : కేంద్ర మంత్రి బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలంగాణ పర్యటన(Tour of Telangana)కు వచ్చే ముందు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వారి ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమధానం చెప్పి రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సెంట్రల్ లైబ్రరీకి, యూనివర్సిటీకి వెళ్ళీ యువతకు రాహుల్ గాంధీ గ్యారంటీలు ఇచ్చారని, అలాగే మహిళలకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు ఆరు గ్యారంటీలు, 420హామీలిచ్చి వెళ్ళారని, మళ్ళీ ఈ రోజు తెలంగాణకు వస్తున్నారని విమర్శించారు. ఏ పార్టీ నాయకులైనా దేశంలో ఎక్కడైనా తిరుగవచ్చన్నారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవ్వడంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.

తను ఇచ్చిన మాటపై తనకు నమ్మకముంటే రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఎన్నికల హామీల వైఫల్యంపై జవాబు చెప్పి తెలంగాణలో అడుగుపెట్టాలన్నారు. గతంలో రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర చేశారని, ఇప్పుడు దమ్ముంటే ఆరు గ్యారంటీలపై ఆయన తెలంగాణ యాత్ర చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.

Advertisement

Next Story

Most Viewed