- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ గాంధీ జీ దో లాక్ నౌకరీ దో.. రాహుల్ పర్యటన వేళ కవిత ట్వీట్
తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీని ఉద్యోగాల భర్తీ విషయంలో జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్‍ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చి రెండున్నరేళ్లు అయ్యిందని ఇకనైనా ఉద్యోగాలు ఇవ్వాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని (Rahul Gandhi) జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కోసం (DCC Presidents Training Program) ఇవాళ రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఎక్స్ వేదికగా కవిత (Kavitha) ప్రశ్నించారు. మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా? అని నిలదీశారు. మీ పార్టీ గద్దెనెక్కడానికి నిచ్చెనమెట్లుగా నిలిచిన యువత ఆశలు, ఆకాంక్షలను చిదిమేశారు.. ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే పోలీసులతో అణచి వేస్తున్నారని మండిపడ్డారు. యూత్ డిక్లరేషన్ బోగస్‍గా మారింది.. జాబ్ క్యాలెండర్ పత్తా లేదు.. కాంగ్రెస్ అంటేనే మోసం.. వంచన అనే మాటను నిలబెట్టుకున్నారని దుయ్యబట్టారు. రాహుల్ జీ ఇది పోరాటాల పురిటిగడ్డ.. మీ హామీని నిలబెట్టుకోండి.. 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని అమలు చేయించండి అని డిమాండ్ చేశారు.






