Phone tapping case: వారిని కంట్రోల్ చేయకపోతే కాంగ్రెస్‍కే నష్టం: రఘునందన్ రావు

by Prasad Jukanti |

Phone tapping case: వారిని కంట్రోల్ చేయకపోతే కాంగ్రెస్‍కే నష్టం: రఘునందన్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) విచారణపై ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్, హరీశ్ రావును ఉద్దేశించి బావ బావమరుదులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని, వీరి నోళ్లను కంట్రోల్ చేయకపోతే అది కాంగ్రెస్ పతనానికే దారి తీస్తుందని హెచ్చరించారు. ఇవాళ మెదక్ జిల్లా దుబ్బాకలో మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు.. కేటీఆర్, హరీశ్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? సిట్ ఏంచేస్తోందని ప్రశ్నించారు. పుష్ప-1 పుష్ప-2 మాదిరిగా సిట్ -1 పోయి సిట్ -2 వచ్చిందని ఇదైనా ముగింపు తీసుకువస్తుందని ఆశీస్తున్నానన్నారు. సిట్ విచారణలో స్పీడ్ పెరిగిందని మిగతా వారికి అనిపించవచ్చు కానీ ఒక వకీల్ గా తనకు అలా ఏమి అనిపించడం లేదని డైలీ సీరియల్ మాదిరిగా దర్యాప్తు కొనసాగుతుందని విమర్శించారు. ఎవరు అధికారంలో ఉన్న దుబ్బాకపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని విమర్శించారు.

Next Story