SHE Teams: పదిహేను రోజుల్లో 127 మంది పోకిరీలను పట్టుకున్న షీ టీమ్స్..

by Ramesh Naini |

పదిహేను రోజుల్లో 127 మంది పోకిరీలను రాచకొండ షీ టీమ్స్ పట్టుకున్నాయి.

SHE Teams: పదిహేను రోజుల్లో 127 మంది పోకిరీలను పట్టుకున్న షీ టీమ్స్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: పదిహేను రోజుల్లో 127 మంది పోకిరీలను రాచకొండ షీ టీమ్స్ (Rachakonda SHE teams) పట్టుకున్నాయి. రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు ఇవాళ (మంగళవారం) రాచకొండ క్యాంపు కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలను, యువతులను వేధింపులకు గురిచేసిన 127 (మేజర్స్-80 ,మైనర్స్-47 ) మందిని షీ టీమ్స్ పట్టుకున్నారు. వారికి ఎల్‌బీ నగర్ CP Camp Office (ఉమెన్ సేఫ్టీ ఆఫీసు)లో, కౌన్సిలర్స్‌తో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. గత నెల తేదీ 16 నుంచి 31వ తేదీ వరకు 194 ఫిర్యాదులు అందాయని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టీ ఉషారాణి తెలిపారు. ఫోన్‌ల ద్వారా వేదించిపులకు దిగినవి-40, సోషల్ మీడియా ద్వారా-74, నేరుగా వేధింపులు-80, వాటిలో క్రిమినల్ కేసులు-7, పెట్టి కేసులు-53, 73 మందికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

మహిళల భద్రతే షీ టీమ్స్ లక్ష్యమని ఈ సంద్భంగా రాచకొండ సీపీ జి. సుధీర్ బాబు తెలిపారు. బాలికలు, మహిళలను వేధించే పోకిరీలను షీ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్, స్కూల్స్, కాలేజీలు, కూరగాయల మార్కెట్, బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీలో తిరుగుతూ షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారని అన్నారు. బాలికలు, మహిళలను వెంబడించే, వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ.. వారిని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నామని వివరించారు.

Next Story