వీహెచ్‌పీ నేతకు రాచకొండ సీపీ బెదిరింపులు

by Dishanational2 |
వీహెచ్‌పీ నేతకు రాచకొండ సీపీ బెదిరింపులు
X

తెలంగాణ బ్యూరో : విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామికి రాచకొండ పోలీస్ కమిషనర్ బెదిరించినట్లు వీహెచ్ పీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ అంశంపై తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. రాష్ట్ర హోంశాఖ మంత్రికి కూడా ఫిర్యాదు చేయాలన్నారు. అయినప్పటికీ స్పందించకుంటే కేంద్ర హోం శాఖ మంత్రికి కంప్లైంట్ ఇచ్చిన వారు సీరియస్ అయ్యారు. బాలాపూర్ హత్య నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లుగా వీహెచ్ పీ అధికారులు. కాగా ఈ వెంటనే వారు సీరియస్ గా తీసుకున్నారు. ఈ మేరకు డీజీపీకి రాసిన లేఖలో పలు అంశాలను వీహెచ్ పీ నేతలు ప్రస్తావించారు. గురువారం రాత్రి బాలాపూర్ లో జరిగిన పవన్ నాయక్ హత్య విషయంలో బాధితుడికి న్యాయం చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేశారు.కాగా, సంఘటన స్థలానికి వెళ్లేందుకు పోలీసులు ఎవరికీ అనుమతిని తాము ఉస్మానియా ఆసుపత్రి వద్దకు వెళ్లి బాధిత కుటుంబాన్ని ఓదార్చినట్లు వీహెచ్ పీ నేతలు తెలిపారు.


బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, దోషులను వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని తాము డిమాండ్ చేశామన్నారు. అయితే గురువారం సాయంత్రం 6:45 గంటలకు రాచకొండ పోలీస్ కమిషనర్ తనకు ఫోన్ చేసి సున్నితమైన కావాలని రెచ్చగొడుతున్నారని, సెన్సేషనల్ కోసం తాపత్రయపడుతున్నారని, చిన్న పర్యవేక్షణ పెద్దగా చేసి పోలీసులను ఇబ్బంది పెడుతున్నామని అన్నట్లుగా వీహెచ్ పీ తెలంగాణ ప్రచార ప్రముఖుడు పగుడాకుల బాలస్వామి పేర్కొన్నారు. లేనిపోని హంగామా చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది తప్పదని హెచ్చరించినట్లు లేఖలో పేర్కొన్నారు. ఇది లాస్ట్ వార్నింగ్ అంటూ బెదిరించారని ఆయన అన్నారు.కాగా ఈవిషయమై ముందుగా డీజీపీకి తెలియజేసేందుకు లేక రాస్తున్నట్లు తెలియజేసారు. పట్టింపు లేకుంటే రాష్ట్ర హోం మంత్రి, గవర్నర్, గవర్నర్ కూడా పట్టించుకోకుండా నేరుగా ఢిల్లీకి కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు.

Next Story