- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stop Operation Kagar : ప్రశ్నిస్తే నక్సలైట్స్ అంటున్నారు : ఆర్ నారాయణ మూర్తి
నేడు హైదరాబాద్(Hyderabad) లోని ఇందిరాపార్క్ వద్ద గల ధర్నా చౌక్(Dharna Chowk) లో కమ్యూనిస్ట్ పార్టీలు, హక్కుల సంఘాల నేతృత్వంలో మహాధర్నా(Mahadharna) జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : నేడు హైదరాబాద్(Hyderabad) లోని ఇందిరాపార్క్ వద్ద గల ధర్నా చౌక్(Dharna Chowk) లో కమ్యూనిస్ట్ పార్టీలు, హక్కుల సంఘాల నేతృత్వంలో మహాధర్నా(Mahadharna) జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేసి, శాంతి చర్చలు చేపట్టాలని పలువురు నాయకులు, హక్కుల సంఘాల నేతలు మహాధర్నాలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కాగా ఈ సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి(R Narayanamurti) మాట్లాడుతూ.. ఈ దేశంలో ప్రశ్నిస్తే నక్సలైట్స్ అని ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. అడిగితే అన్నలని అడగకుండా నోరుమూసుకొని ఉన్నవాడు ఎన్ని తప్పులు చేసినా ఆల్ రైట్ అంటున్నారని ధ్వజం ఎత్తారు.
తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి(Stop Operation Kagar), మావోయిస్టు సంఘాలతో, నేతలతో చర్చలకు రావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జనసమితి అధినేత, ఎమ్మెల్సీ కోదండరామ్(MLC Kodandaram) మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్ పేరుతో అదివాసీలను చంపుతున్నారని, అడవి నుంచి అదివాసీలను తరిమివేసి అటవీ వనరులను కార్పొరేట్స్ కి కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని అన్నారు.






