- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆర్. కృష్ణయ్య.. కారణం ఇదే
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బీసీ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బీసీ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిసి బీసీ సంఘాల నాయకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో బీసీ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తూ, సీఎంను కలిసి సంబంధిత చట్ట సవరణకు ఆర్డినెన్స్ జారీ చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయంపై ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఆర్ కృష్ణయ్యతో పాటు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (TGMDC) చైర్మన్ ఈరవత్రి అనిల్, బీసీ సంఘాల ఇతర నాయకులు పాల్గొన్నారు.






