- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
R. Krishnaiah: అదే జరిగితే అల్లకల్లోలమే ప్రభుత్వానికి ఆర్.కృష్ణయ్య హెచ్చరిక
బీసీ రిజర్వేషన్ల విషయంలో అడుగడుకునా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కృష్ణయ్య కోరారు.

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) కల్పించేలా రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బీసీల విజయంగా భావిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య (R. Krishnaiah) అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. 70 ఏళ్లకు పైగా బీసీ రిజర్వేషన్ల విషయంలో తమకు అన్యాయం జరుగుతూనే ఉందని ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వం అడుగడుగునా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల విషయంలో కోర్టుకు వెళ్తారని అక్కడ కొట్టేస్తారని కొంత మంది మాట్లాడుతున్నారు. కోర్టుకు వెళ్లినా వారి వాదన నిలబడదన్నారు. రాజకీయ, చట్ట, న్యాయ పరమైన అవరోధాలు ప్రభుత్వానికే లేవని రాజకీయంగా అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదింస్తే చట్ట ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఉందన్నారు. ఇక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేషన్ కమిషన్ ఏర్పాటుతో ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నందునా ప్రభుత్వం వైపే బలం ఉందన్నారు.
టైమ్ వేస్ట్ చేయొద్దు:
తెలంగాణలోని అగ్రకులాల సోదరులు బీసీలకు రిజర్వేషన్ల విషయంలో సానుకూలంగా ఉన్నారని వారంతా తనకు ఫోన్ చేసి సపోర్టు చేస్తామని చెబుతున్నారని ఆర్.కృష్ణయ్య చెప్పారు. బీసీలు సర్పంచ్ లు, ఎంపీటీసీలు అయితే తమకు సంతోషమే అని చెబుతున్నారని అన్నారు. ఎవరైనా కోర్టుకు పోయినా వారిని అడ్డుకుంటామని చెబుతున్నారని వెల్లడించారు. రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వానికే సానుకూలత ఉన్నందున సమయం వృథా చేయకుండా ఎన్నికలకు వెళ్లాలని సూచించారు.
ఏదైనా జరిగితే అల్లకల్లోలమే:
అన్ని అనుకూలతను ఉన్నా ఏదైనా ఆటంకం ఏర్పడితే బీసీలంతా తిరగబడతారని హెచ్చరించారు. మండల్ కమిషన్, ఎన్టీఆర్ రిజర్వేషన్లు పెంచిన సమయంలో సమాజంలో అల్లకల్లోలం రేగిందని అటువంటి పరిస్థితి రావొద్దని అన్నారు. జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి రావాలనే మేము అడిగుతున్నామని ఎవరిని శత్రువులుగా చూడటం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసులు వేసినా ముందుగా ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాకే ఆ పటిషన్లపై విచారణ జరిపేలా హైకోర్టు, సుప్రింకోర్టులో ప్రభుత్వం కేవియట్ పిటిషన్ ను దాఖలు చేయాలని డిమాండ్ శారు.






