Group 2 : గ్రూప్ 2లో చంద్రబాబు గురించి ప్రశ్నలు.. ఫైర్ అయిన విపక్షాలు

by M.Rajitha |   ( Updated:2024-12-16 17:03:11.0  )
Group 2 : గ్రూప్ 2లో చంద్రబాబు గురించి ప్రశ్నలు.. ఫైర్ అయిన విపక్షాలు
X

దిశ, వెబ్ డెస్క్ : సోమవారం జరిగిన గ్రూప్ 2(Group 2) పరీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) గురించి ప్రశ్నలు రావడంతో అభ్యర్థులు ఖంగుతిన్నారు. గ్రూప్ 2 నాలుగు పేపర్లలో చివరిదైన తెలంగాణ ఉద్యమం పేపర్(Telangana Movment Paper) సోమవారం మధ్యాహ్నం జరిగింది. అయితే ఈ పేపర్లో తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాల నుంచి పలు ప్రశ్నలు వస్తాయని ఊహించిన అభ్యర్థులకు, ఉమ్మడి ఏపీలోని చంద్రబాబు నాయుడు పాలన గురించి పలు ప్రశ్నలు ఆడగటంతో విస్తుపోయారు. ఇది తెలంగాణ ఉద్యమం పేపరా? టీడీపీ పేపరా అంటూ పరీక్ష కేంద్ర నుంచి బయటికి వచ్చిన అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. 'ఇది టీజీపీఎస్సీ(TGPSC)నా ? టీడీపీ(TDP) ఎస్సీనా? ఇది తెలంగాణ ప్రభుత్వమా ? తెలుగుదేశం ప్రభుత్వమా?' అని మండిపడుతున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బహిరంగంగా ప్రకటించారని, కాని నిజానికి తెలంగాణ ఆనవాళ్లు లేకుండా కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ పరీక్షల్లో తెలుగుదేశం ప్రస్తావన ఎందుకని బీఆర్ఎస్ నేతలు నిలదీస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, కష్టాలు, కన్నీళ్లకు తొలిద్రోహి కాంగ్రెస్ అయితే.. మలిద్రోహి టీడీపీ అని దుయ్యబట్టారు. ఉద్యమంలో కాంగ్రెస్, టీడీపీ చేసిన మోసాలు, ద్రోహాలు తెలంగాణ ఎప్పటికీ మరిచిపోదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు చేతిలో కీలు బొమ్మగా మారి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడుతున్నారు.

Advertisement

Next Story