పీవీకి భారతరత్న రావడంపై ఆయన కుమార్తె రియాక్షన్ ఇదే..

by Ramesh Naini |

తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ సురభీ వాణీదేవి స్పందించారు.

పీవీకి భారతరత్న రావడంపై ఆయన కుమార్తె రియాక్షన్ ఇదే..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ సురభీ వాణీదేవి స్పందించారు. ఇవాళ ఆమె అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడారు. ఆలస్యమైనా పీవీకి భారతరత్న రావడం చాలా సంతోషంగా ఉందని వాణి దేవి హర్షం వ్యక్తంచేశారు.

1991-95 సమయంలో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. పీవీ ఆర్థిక సంస్కరణల వల్లే భారత్ ఈ స్థితిలో ఉందని గుర్తు చేశారు. పీవీకి అన్ని పార్టీల్లో మిత్రులు ఉండేవారని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించటం‌లో పీవీ దిట్ట అని వెల్లడించారు. తాను చూసిన మెదటి ల్యాప్‌టాప్ పీవీ‌దేనని పేర్కొన్నారు.

Next Story