మంత్రి వివేక్ సభలో ప్రోటోకాల్ రగడ

by Muthe.Rajitha |

మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) సభలో ప్రోటోకాల్ రచ్చ రేగింది.

మంత్రి వివేక్ సభలో ప్రోటోకాల్ రగడ
X

దిశ, వెబ్ డెస్క్ : మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) సభలో ప్రోటోకాల్ రచ్చ రేగింది. నేడు సిద్దిపేట(Siddipeta) జిల్లాలో జరిగిన నూతన రేషన్ కార్డుల పంపిణీ(Ration Cards Distribution) కార్యక్రమంలో రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వెంకటస్వామి పాల్గొన్నారు.ఈ సభలో కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్(BRS) నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో, మంత్రి వివేక్ 5.61 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా స్థానిక లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(MLA Harish Rao) సహా బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ నాయకులు తగిన ప్రోటోకాల్ ఇవ్వకుండా కార్యక్రమాన్ని నిర్వహించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తమను కావాలని పక్కనపెట్టారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6.47 లక్షల రేషన్ కార్డులు జారీ చేశామని, అలాంటిది ఒక్క కార్డు కూడా పంపిణీ చేయలేదని ఎలా చెబుతారని ఆందోళన చేసారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.

మరోవైపు పేదలకు ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో, వివక్ష లేకుండా అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తున్నామని, గత బీఆర్ఎస్ పాలనలో లక్షలాది కుటుంబాలకు రేషన్ కార్డులు నిలిపివేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఉద్రిక్తతల అనంతరం మంత్రి వివేక్, ఎమ్మెల్యే హరీష్ రావు సమక్షంలో రేషన్ కార్డుల పంపిణీ కొనసాగింది.

Next Story