- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నదమ్ముల ఆస్తి వివాదం.. గూగుల్ సంస్థకు బాంబు బెదిరింపు అంటూ..
అన్నదమ్ముల ఆస్తి వివాదం ముదిరింది.

దిశ, వెబ్‌డెస్క్: అన్నదమ్ముల ఆస్తి వివాదం ముదిరింది. వివాదం కాస్తా గూగుల్ సంస్థకు చేరింది. ఆ సంస్థలో పని చేస్తున్న అన్నకు ఇచ్చిన వార్నింగ్ కాస్త బాంబ్ బెదిరింపుగా మారింది. పుణేలోని గూగుల్ ఆఫీస్ కు బాంబు బెదిరింపు కాల్ అంటూ కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు సోమవారం చందానగర్ లో శివానంద్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. అయితే విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు చెప్పాడు నిందితుడు.
రాయదుర్గం పీఎస్ పరిధిలోని చిత్రపురికాలనీకి చెందిన దయానందర్, శివానంద్ బ్రదర్స్. కాగా వీరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. నగరంలో ఉన్న ఓ ఇంటిని విక్రయించే విషయంలో వీరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. ప్రస్తుతం దయానంద్ పుణేలోని గూగుల్ క్యాంపస్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం అన్నకు ఫోన్ శివానంద్ ఇంటి విషయమై తీవ్ర వాగ్వివాదానికి దిగాడు. ఫోన్‌లో గొడవ పెరగడంతో మాట వినకపోతే బాంబుతో పేల్చేస్తానని బెదిరించాడు.
దీంతో దయానంద్ తమ్ముడిని ఎలాగైనా ఇరికించాలని ముంబైలో ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని గూగుల్ క్యాంపస్ మేనేజర్ కు ఫోన్ చేశాడు. రాత్రి 7.54 గంటల సమయంలో తనకు ఓ ఆగంతకుడు ఫోన్ చేసి కార్యాలయాన్ని పేల్చేయనున్నట్లు బెదిరించినట్లు తెలిపాడు. ఆగంతకుడి నంబర్ అంటూ తన సోదరుడి నంబర్ నే ఇచ్చాడు. ఈ క్రమంలో ఆందోళనకు గురైన మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడి ఫోన్ ప్రాథమిక సాంకేతిక ఆధారాలను బట్టి సైబరాబాద్ పరిధిలో ఉన్నట్లు గుర్తించి సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటికి వచ్చాయి.
- Tags
- Crime






