- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Ponnam : పర్యావరణ హితానికే ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం : మంత్రి పొన్నం
పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచడం(Increasing The Use Of Electric Vehicles) కోసం కొత్త విధానాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచడం(Increasing The Use Of Electric Vehicles) కోసం కొత్త విధానాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఐటీసీ కాకతీయ హోటల్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈటో మోటార్స్ నుంచి ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ రాష్ట్రంలోని ఈవీ పాలసీ ప్రకారం, రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్ 2026 డిసెంబర్ 31 వరకు మినహాయింపు ఇచ్చినట్లు మంత్రి ప్రకటించారు.
ఈ విధానం వల్ల కాలుష్యాన్ని తగ్గించడం, నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈటో మోటార్స్ ఫ్లిక్స్ బస్.. ఎలక్ట్రిక్ బస్సును మొదటిసారి తెలంగాణలో ప్రారంభించడం, రాష్ట్రంలో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న కొత్త చర్యలకు నిదర్శనమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా నగరంలోని ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని, ఇతర వాహనాలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడంలో ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు.
వాహన సంస్థలు, వాహనదారులు రవాణా శాఖకి సంబంధించిన అన్ని నిబంధనలను పాటించాలని.. ఈవీ బస్సుల వినియోగం పెరిగితే, భవిష్యత్తులో మరిన్ని రకాల ఈవీ బస్సులు ప్రవేశపెట్టాల్సిన అవరసరం ఉందన్నారు. కులగణనపై అనుమానాల నివృత్తికి బలహీన వర్గాల బిడ్డగా బీసీ సంఘాలతో సమావేశానికి నేను సిద్ధమని, అందుకు రోడ్ మ్యాప్ ఇవ్వండని తెలిపారు. పార్టీ ఆలోచన.. అధికారుల పని తీరు మాకు తెలుసునని, ప్రజలను కన్ఫ్యూజ్ చేయకండని అన్నారు. కుల గణన మొదటి సారి చేసిందని.. దానికి న్యాయం జరగడానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మా ఆలోచన, బలహీన వర్గాలకు న్యాయంచేయడమే అని పొన్నం స్పష్టం చేశారు.






