- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి వర్సిటీ సరికొత్త ప్రయత్నం.. ఇక రోబోల వ్యవసాయం
మావన రహిత వ్యవసాయం చేసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి వర్సిటీ నడుం బిగించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: మావన రహిత వ్యవసాయం చేసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి వర్సిటీ నడుం బిగించింది. ఎస్బీఐ సాకారంతో యూనివర్సిటీలో ఏఐ, రోబోటిక్స్, ఐవోటీ ఆధారిత స్మార్ట్ ల్యాబ్ ఏర్పాటుకు సిద్దమైంది. రోబోలోతో వ్యవసాయం, కెమెరాలతో చీడపీడల గుర్తింపు వంటి సమస్యలను ముందుగానే గుర్తించే టెక్నాలజీ వినియోగించనుంది. ఏఐ ద్వారా భూమిలో తేమ, పంటలలో వచ్చే చీడపీడల గుర్తింపు చేసి ముందుగానే రైతులకు మెసెజ్ రూపంలో సమాచారం అందించనుంది. తొందరలోనే చిన్న, సన్నకారు రైతులకు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అటోమెటిక్ డ్రిప్ ద్వారా నీటి సరఫరా, నెట్ హౌస్‌లో అటోమెటిక్‌గా ఫాగింగ్ సిస్టంను తీసుకొస్తుంది. నేరుగా ఏ ప్రాంతంలో చీడపీడలు ఉన్నాయో అక్కడే మందులు పిచికారి చేసే వ్యవస్థను తేనుంది. భూమిలో నత్రజని, పాస్పరస్, తేమ శాతం తెలుసుకునేలా ఐవోటి సెన్సర్ విధాన్నాన్ని తీసుకొస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఏఐ, రోబోటిక్, ఐవోటీని అనుసంధానంగా సెంట్రలైజ్డ్ వ్యవస్థను డేటా సెంటర్ ద్వారా మూడు వింగ్స్ అనుసంధానం చేసేందుకు ప్లాన్చేస్తోంది. ఇటీవల వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కూలీల సమస్య, చీడపీడలు, వాతావరణ మార్పులతో తక్కువ దిగుబడులు లాంటి సమస్యలతో రైతులు తీవ్రంగా నష్టపోయి, అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఇలాంటి వాటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కొత్త టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చింది.
యువతను వ్యవసాయం వైపు మళ్లీంచేందుకు టెక్నాలజీ
రాష్ట్రంలో కొత్త తరం యువత వ్యవసాయం చేసేందుకు ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో ఆధునిక శిక్షణ, టెక్నాలజీని అందుబాటులోకి తేవడం ద్వారా యువతను సేద్యం వైపు ఆకర్షించి, ఆ రంగాన్ని సుస్థిరంగా భవిష్యత్ తరాలకు అందించనున్నది. కూలీలు లేకుండా అరచేతిలో రిమోట్ కంట్రోల్‌తో పంటపొలాల్లో ఏఐ రోబొటిక్ మెషీన్‌తో అన్ని పనులూ చేయవచ్చు. నిర్ధిష్టమైన లోతు, దూరంలో విత్తనాలు, మొక్కలను నాటేందుకు అనువుగా ఉంటుంది. కెమెరాల వంటి న్యూ టెక్నాలజీని ఉపయోగించి పొలంలో కలుపు మొక్కలను తొలగిస్తుంది. సాఫ్ట్‌వేర్‌ను సెల్‌ఫోన్‌తో అనుసంధానం చేసి రోబోను రిమోట్ సహాయంతో కంట్రోల్ చేస్తుంది. మొక్కలు నాటేటప్పుడు దీని సాయంతో రసాయన ఎరువులు చల్లి కలుపు నియంత్రివచ్చు. అతి తక్కువ మోతాదులో రసాయనాల వినియోగం ఉంటుంది.
ఆటోమెటిక్వాతావరణ కేంద్రం ఏర్పాటు
ఏఐ టెక్నాలజీ ద్వారా పంటల పర్యవేక్షణ, నిర్ణయాత్మక సహాయక వ్యవస్థ, తెగుళ్ల గుర్తింపునకు ఏఐ ఆధారిత పరిశోధన వ్యవస్థలున్నాయి. ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం, దిశ, వాతావరణ పీడనం సమాచారాన్ని సేకరించే ఆటోమేటిక్ వాతావరణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఎరువుల వినియోగం, పంట నిర్వహణకు సంబంధించి రైతులు సరైన నిర్ణయాలను తీసుకునేలా మార్గదర్శనం చేస్తుంది. భూమిలో తేమ, పోషకాలు, రసాయన ప్రమాణాలను తక్షణమే కొలిచే మాడర్న్ సెన్సర్లు ఆటోమేటిక్ డ్రిప్ సాగు విధాన వ్యవస్థతో అనుసంధానమై పనిచేస్తాయి. తేమస్థాయి తగ్గిన వెంటనే డ్రిప్ దానికదే పంటకు తడి అందిస్తుంది. తద్వారా నీటి వినియోగం తగ్గించి నీటి వృథాను అరికట్టవచ్చు. నెట్‌హౌస్‌లో ఉష్ణోగ్రత, తేమ లాంట వాటిని సెన్సర్ల నుంచి లభించే డేటా ఆధారంగా ఆటోమేటిక్‌గా డ్రిప్, ఫాగింగ్ వ్యవస్థలు నియంత్రిస్తాయి. ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు ఫాగర్ యంత్రాలు వాటికవే పనిచేస్తూ తేమను బ్యాలెన్స్ చేస్తాయి. పంట పెరుగుదలకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తాయి. డ్రోన్లలో ఏఐ ఆధారిత కెమెరాలు, సెన్సర్లు పంటలపై తెగుళ్ల దాడి, నీటి కొరత, పోషకాల లోపం లాంటి వాటిని ముందుగానే గుర్తించి హెచ్చరికలు అందజేస్తాయి.
త్వరలో సన్న, చిన్నకారు రైతులకు అందిస్తాం
గ్రామీణ ప్రాంతంలో చిన్న, సన్నకారు రైతులకు ఏఐ రోబోటిక్, ఐవోటీ ఆధారిత టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చేందుకు ల్యాబ్ ను ప్రారంభించాం. యూనివర్సిటీ అందుకు తగిన ప్రణాళికలను రూపొందించి ఇవ్వగా వర్సిటీ పూర్వ విద్యార్థి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి సీఎస్‌ఆర్ కింద రూ.15 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారు. తొమ్మిది నెలల్లోనే ఈ వినూత్న ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. వాతావరణ మార్పులు, భూసారం దెబ్బతినడం, అధిక ఎరువులు, పంటలకు తెగుళ్లు, దిగుబడుల లోపం, రైతులకు అధిక వ్యయాలు, కూలీల కొరత లాంటి అనేక సవాళ్లకు తక్కువ ఖర్చుతో కూడిన శాస్త్రీయ పరిష్కారాలను చూపించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. -జానయ్య, వీసీ, పీజేటీఎస్ఏయూ






