- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో రెండో రోజు ప్రైవేటు కాలేజీల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రవేట్ కాలేజీలకు ప్రభుత్వం బాకాయిపడ్డ ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధుల విడుదల కోసం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలు బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రవేట్ కాలేజీలకు ప్రభుత్వం బాకాయిపడ్డ ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధుల విడుదల కోసం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలు బంద్ కు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్ సోమవారం నుంచి ప్రారంభం కాగా.. నేడు.. రెండో రోజు కూడా దాదాపు 2,000కు పైగా ప్రైవేట్ డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ కాలేజీలు బంద్‌లో పాల్గొన్నాయి. ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు కోట్ల రూపాయలు నిలిచిపోయాయని, దీంతో విద్యాసంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. సోమవారం అంబేద్కర్, ఇందిరా గాంధీ విగ్రహాల వద్ద కాలేజీ ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి వినతి పత్రాలు సమర్పించి నిరసన తెలిపారు.
ఇదిలా ఉంటే బీసీ విద్యార్థి సంఘాలు ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిల విషయంలో.. ప్రైవేట్ కాలేజీల ఉద్యమానికి మద్దతు ప్రకటించి విద్యామండలి ముట్టడికి పిలుపు ఇచ్చారు. ప్రభుత్వం తక్షణమే బకాయిలు విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఆలస్యం కారణంగా విద్యార్థులు, కాలేజీలు రెండూ ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విద్యా సంస్థల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభిస్తామని విద్యార్థి సంఘాలు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.






