బండి సంజయ్ తో మల్లారెడ్డి కోడలు భేటీ

by Muthe.Rajitha |

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

బండి సంజయ్ తో మల్లారెడ్డి కోడలు భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్(MP Bandi Sanjay) తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy) కోడలు భేటీ అయ్యారు. నేడు మేకలమండి బీజేపీ లీడర్ ఇంట్లో కేంద్రమంత్రితో కలిసి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి(Prithi Reddy) లంచ్ కి అటెండ్ అయ్యారు. అయితే ప్రీతిరెడ్డి ప్రస్తుతం గులాబీ పార్టీలో కొనసాగుతుండగా.. వీరి భేటీ ప్రస్తుతం ఇరు పార్టీల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా నిన్న పాతబస్తీలో జరిగిన బోనాల వేడుకలో బండి సంజయ్ ఫోటోతో ప్రీతిరెడ్డి ఫ్లెక్సీలు వెలిశాయి. కాగా నేడు వారు ఇరువురు ప్రత్యేక సమావేశం కావడం వెనుక ఏమై ఉండవచ్చునని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రీతిరెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనుందని, అందుకే బీజేపీ నాయకులతో చర్చలు జరుపుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

Next Story