నన్ను తృప్తి పరుచు నీ పని అయినట్టే.. ఏడీఏకు షాకిచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ

by Bhoopathi Nagaiah |

ఫైల్‌ను పైకి పంపాలంటే తనను సాటిస్‌ఫై చేయాలంటూ ఓ మహిళను వేధింపులకు గురి చేసిన రూరల్ ఏడీఏ సస్పెండ్ అయ్యారు.

నన్ను తృప్తి పరుచు నీ పని అయినట్టే.. ఏడీఏకు షాకిచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ
X

ఫైల్‌ను పైకి పంపాలంటే తనను సాటిస్‌ఫై చేయాలంటూ దివంగత అధికారి సతీమణి అయిన ఓ మహిళను వేధింపులకు గురి చేసిన రూరల్ ఏడీఏ పిండి ప్రదీప్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వేధింపులపై పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయండి.

పాక్‌కు గూఢచార్యం ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధాలు లేవని హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాలు, ఆ గ్రూపులతో సంబంధాలు ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. అదేవిధంగా ఆమెకు భద్రతా దళాల గురించి ఎలాంటి అవగాహన లేదన్నారు. పాక్ ఐఎస్ఐ ఏజెంట్‌ను జ్యోతి పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు ఆమె వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు దొరకలేదని చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

బాలీవుడ్ బ్యూటీ, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. విషయం ఏంటంటే.. తాజాగా జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2025 ఈవెంట్‌కు హాజరైన ఐశ్వర్య సిందూర్ పెట్టుకొని కనిపించింది. అయితే ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలకు తెలిసేలా ఐశ్వర్య సిందూర్ పెట్టుకున్నారన్న చర్చ సాగుతోంది. దీనికి సంబంధించిన కథనం తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయాల్సిందే.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెండి తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ‘మన ఊరు-మాటామంతి’ అనే పేరుతో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవాని థియేటర్‌లో ఈ కార్యక్రమాన్ని ఆయన ఇవాళ ప్రారంభించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా థియేటర్‌లో ఉన్న రావివలస గ్రామస్తులతో మాట్లాడారు. ఈ నూతన కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

Next Story