- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోగం నయం కావాలని ఆస్పత్రికి వస్తే.. అక్కడి నుంచి మరో రోగంతో ఇంటికి!
శంకర్‌పల్లి మున్సిపల్ కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం ఇటీవల కురిసిన వర్షాలకు నీరు కారుతుంది.

దిశ, శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం ఇటీవల కురిసిన వర్షాలకు నీరు కారుతుంది. భవనం పైకప్పు నుంచి నీరు లీకేజీ కావడంతో చికిత్స కోసం వస్తున్న రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురుస్తుండడంతో పైకప్పు నుంచి నీరు కారుతుండంతో సిబ్బంది బకెట్లు పెట్టి రోగులకు ఇబ్బందులు కలవకుండా చూస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ స్వార్థం మూలంగా నాసిరకంగా పనులు చేపట్టడంతో నీరు కారుతోందని రోగుల వెంట వచ్చే బంధువులు ఆరోపిస్తున్నారు. చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే ఆసుపత్రిలో వర్షాలతో కొత్త రోగం వచ్చే అవకాశం ఉందని వారు వాపోతున్నారు.
ఆరు పడకలకే పరిమితం..
ప్రాంతాలు వేరుపడి ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో పదవులు చేపట్టిన ప్రజా ప్రతినిధులు ఎన్నికల సమయంలో ఇచ్చిన 30 పడకల ఆసుపత్రి కాగితాలకే పరిమితమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ఏర్పడినప్పటికి చేవెళ్ల శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఎన్నికలకు ముందు 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ కలగానే మిగిలింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆరు పడకల ఆసుపత్రికి కూడా ఉన్న భవనం వర్షపు నీరు కారుతోంది.
ప్రహరీ గోడ కూడా లేదాయే..
30 పడకల ఆసుపత్రి ఏర్పాట మాట దేవుడుఎరుగు కాని నగరానికి నాలుగు పదుల దూరంలో ఉన్న శంకర్పల్లి గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఏర్పాటైనప్పటికీ సరియైన వైద్య సౌకర్యం లేదు. ఒక డాక్టరే ఇక్కడ వైద్యం చేస్తుంటారు.
డిప్యూటేషన్ పై మరో డాక్టర్, సిబ్బంది..
శంకర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండు డాక్టర్ పోస్టులు ఉన్నప్పటికీ ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. మరొక డాక్టరుతో పాటు సిబ్బంది డిప్యూటేషన్ పై నగరంలో విధులు నిర్వహిస్తున్నారు. జీతం మాత్రం శంకర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తీసుకుంటూ నగరంలో విధులు నిర్వహిస్తుండటం పట్ల గ్రామీణ శంకర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు సరిపోను వైద్యం అందడం లేదు.






