- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రెస్ కౌన్సిల్ పేరును వ్యక్తులు, సంస్థలు వాడరాదు : కౌన్సిల్ ఆదేశాలు
ప్రెస్ కౌన్సిల్ పేరును వ్యక్తులు, సంస్థలు ఉపయోగించరాదని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రటరీ శుభా గుప్త స్పష్టం చేశారు.

దిశ , తెలంగాణ బ్యూరో : ప్రెస్ కౌన్సిల్ పేరును వ్యక్తులు, సంస్థలు ఉపయోగించరాదని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రటరీ శుభా గుప్త స్పష్టం చేశారు. ప్రెస్‌కౌన్సిల్‌కు ఏ రాష్ట్రంలో కూడా బ్రాంచి లేదన్నారు. ప్రెస్కౌన్సిల్కార్యాలయం దేశ రాజధాని న్యూ ఢిల్లీ లోని లోధి రోడ్ సీజీఓ కాంప్లెక్స్‌లో ఉన్న సూచనా భవన్లో మాత్రమే ఉన్నదని గమనించాలన్నారు. ప్రెస్‌కౌన్సిల్ పేరును స్థానిక సంస్థలు, ప్రభుత్వ అసోసియేషన్లు వినియోగించకుండా తగు చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ఉత్తర్వులు జారీచేయాలని అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు శుభా గుప్త లేఖ రాశారు.
ప్రెస్కౌన్సిల్పేరు గానీ, ప్రెస్ కౌన్సిల్సూచించినట్లు గానీ పేర్లను వినియోగించుకునే అనుమతి ఎవరికి ఇవ్వలేదని ఆ లేఖలో స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ ఇతర సంస్థ కూడా ప్రెస్ కౌన్సిల్పేరును వినియోగించరాదని ఇప్పటికే కేంద్ర న్యాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా అభిప్రాయ పడిన విషయాన్ని సీఎస్‌లకు శుభా గుప్తా గుర్తు చేశారు. ప్రెస్కౌన్సిల్పేరును ఇతరులు వాడితే సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించినట్లే అవుతుందని ఆయన స్పష్టం చేశారు.






