- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రపతి ముర్ము తెలంగాణ పర్యటన.. మంత్రి సీతక్కకు కీలక బాధ్యతలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 17 నుంచి 22 వరకు తెలంగాణలో పర్యటించనున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) డిసెంబర్ 17 నుంచి 22 వరకు తెలంగాణలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఈ నేపథ్యంలో, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ను రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ‘మినిస్టర్-ఇన్-వైటింగ్’గా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధిత అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు శాఖ తగు భద్రతా, ట్రాఫిక్, బందోబస్త్ ప్రణాళికలను రూపొందిస్తోంది.






