Bhatti Vikramarka : ప్రేమ్ సాగర్ నాకు తోబుట్టువు లాంటివాడు : భట్టి విక్రమార్క

by Muthe.Rajitha |

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) సోమవారం మంచిర్యాలలో పర్యటించారు.

Bhatti Vikramarka : ప్రేమ్ సాగర్ నాకు తోబుట్టువు లాంటివాడు : భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) సోమవారం మంచిర్యాలలో పర్యటించారు. బీఆర్ అంబేద్కర్ జయంతి(BR Ambedkar Jayanthi) సందర్భంగా మంచిర్యాలలో భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao)తో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్తో నాకు మంచి అనుబంధం ఉందని, ఆయన తనకు తోబుట్టువు లాంటివాడని వ్యాఖ్యలు చేశారు. గతంలో తన పాదయాత్ర(Padayatra) సందర్భంగా ఏప్రిల్ 14న మంచిర్యాలలో బహిరంగ సభ నిర్వహించామనీ గుర్తు చేసుకున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర దిగ్విజయంగా సాగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, దొరల పాలనను గద్దె దించామనీ తెలిపారు.

మంచిర్యాలలో రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నామని, ఇకపై వైద్యం కోసం హైదరాబాద్ వరకు వచ్చే అవసరం ఉండకుండా ఇక్కడే అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పట్టణం పక్కనున్న రాళ్లవాగు నుంచి గోదావరి పరిసరాలు ముంపుకు గురికాకుండా రూ.260 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 59 వేల ఉద్యోగాలు ఇచ్చామని, రైతులకు రూ.21 వేల కోట్లతో రుణాలు మాఫీ చేశామని అన్నారు. పేదలకు సన్న బియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ సర్కారుదేనని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అయితే ఈరోజు ఉదయం తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కుటుంబం తనపై కక్షగట్టి తన గొంతుకోసే ప్రయత్నం చేస్తున్నారని.. అదే జరిగితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

Next Story