Medico Preethi: ప్రీతి ఆ విషయం ముందే చెప్పింది.. ఇది ముమ్మాటికి హత్యే: ప్రీతి సోదరి

by Disha Web Desk 19 |
Medico Preethi: ప్రీతి ఆ విషయం ముందే చెప్పింది.. ఇది ముమ్మాటికి హత్యే: ప్రీతి సోదరి
X

దిశ, వెబ్‌డెస్క్: వైద్య విద్యార్థిని ప్రీతి మరణంపై ఆమె సోదరి కీలక వ్యాఖ్యలు చేశారు. కులాన్ని వేలెత్తి చూపుతూ ప్రీతిని తక్కువ చేశారని.. సీనియర్లందరూ కలిసి ప్రీతిని దూరం పెట్టారని తెలిపారు. సీనియర్లంతా కలిసి ఓ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రీతిని ఒంటరి దానిని చేశారని ఆమె ఆరోపించారు. సైఫ్ ఒక్కడే కాకుండా చాలా మంది సీనియర్లు వేధించారని ప్రీతి చెప్పిందన్నారు. కానీ మ్యాటర్ ఇంత సీరియస్‌గా ఉందని మాకు తెలియదన్నారు. డ్యూటీలు మార్చి మార్చి వేధిస్తున్నారనే విషయాన్ని ప్రీతి గ్రహించలేకపోయిందన్నారు.

ఏ విషయం ఉన్నా ఫేస్ టూ ఫేస్ చెప్పడం ప్రీతికి అలవాటని.. బయటివారితో ఫోన్లు చేయిస్తున్నావని సీనియర్లు ఆమెను తిట్టారని చెప్పిందన్నారు. సీనియర్లు తనను ఏదో చేస్తారని ప్రీతి ముందు నుండే చెబుతోందని.. ఇది కచ్చితంగా హత్యే అని ప్రీతి సోదరి ఆరోపించారు. ఇక, సీనియర్ వేధింపులు తాళలేక కేఎంసీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. గత ఐదు రోజులుగా హైదరాబాద్ లోని నిమ్స్‌లో చికిత్స పొందిన ప్రీతి.. ఆరోగ్యం విషమించడంతో ఆదివారం రాత్రి మృతి చెందింది.

Read more:

Medico Preethi Death: మెడికో ప్రీతి మరణం అత్యంత బాధకరం: పవన్ కల్యాణ్

Next Story

Most Viewed