- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈనెల 17న ప్రీ బిడ్ మీటింగ్
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో కోకాపేట్, మూసాపేట్ ప్రాంతాలలో ఉన్న ఖాళీ ప్లాట్ల ఈ-ఆక్షన్‌కు సంబంధించి ప్రీ-బిడ్ సమావేశం ఈనెల 17వ తేదిన మాదాపూర్ లోని టీ-హబ్ లో నిర్వహించనున్నారు.

- కోకాపేట్, మూసా పల్లి ప్లాట్ల వేలానికి హెచ్ఎండీఏ కసరత్తు
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో కోకాపేట్, మూసాపేట్ ప్రాంతాలలో ఉన్న ఖాళీ ప్లాట్ల ఈ-ఆక్షన్‌కు సంబంధించి ప్రీ-బిడ్ సమావేశం ఈనెల 17వ తేదిన మాదాపూర్ లోని టీ-హబ్ లో నిర్వహించనున్నారు. సర్వే నంబర్లు 239, 240లో ఉన్న కోకాపేట్ నియో పోలీసు లేఅవుట్‌లో (6) ప్లాట్లు, కోకాపేట్ గోల్డెన్ మైల్ లేఅవుట్‌లో ఒక ప్లాట్, సర్వే నంబర్లు 121–141, 146, 147, 155–157లో ఉన్న మూసాపేట్ గ్రామంలోని రెండు ప్లాట్లకు వేలం నిర్వహించడానికి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీచేశారు. ఈ సమావేశంలో డెవలపర్లు, బిల్డర్లు, ఇన్వెస్టర్లు, ఆసక్తి కలిగిన వ్యక్తులు ఈ ప్రీ-బిడ్ సమావేశానికి హాజరై ఈ-ఆక్షన్ ప్రక్రియ, ప్లాట్ వివరాలు, నిబంధనలపై సమగ్ర సమాచారం పొందవచ్చని అధికారులు తెలిపారు. ఆక్షన్ తేదీలు, నమోదు విధానాలకు సంబంధించిన పూర్తి వివరాలు హెచ్ఎండీఏ అధికారిక వెబ్‌సైట్ www.hmda.gov.inలో అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.






