- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ramadan: రంజాన్ ఆఖరి జుమ్మా..చార్మినార్, మక్కా మసీదులో ప్రశాంతంగా ముగిసిన ప్రార్థనలు
హైదరాబాదులోని చారిత్రక మక్కా మసీదులో రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాదులోని చారిత్రక మక్కా మసీదులో రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నేడు రంజాన్ మాసం ఆఖరి శుక్రవారం (జుమ్మా) (Makkah Masjid) మక్కా మసీదు, చార్మినార్ (Charminar) ప్రాంతం కిక్కిరిసిపోయింది. వేల సంఖ్యలో మక్కామసీదు వద్ద నమాజ్ చేయడానికి ముస్లింలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మక్కా మసీదు, పరిసర ప్రాంతాల్లో ప్రశాంతంగా ప్రార్థనలు ముగిశాయి. మక్కా మసీదు రంజాన్ ప్రార్థనల్లో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) పాల్గొన్నారు.
భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రత్యేక భద్రత
కాగా, పవిత్ర రంజాన్ మాసం చివరి శుక్రవారం కావడంతో చార్మినార్, మక్కా మసీదు (Mecca Masjid) వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారుల ఫోకస్ పెట్టారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి మక్కా మసీదు వరకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు చార్మినార్, మదీనా, శాలిబండ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి.






