BC Reservations: బీసీ రిజర్వేషన్ అమలు కోసం బాపూ ఘాట్ వద్ద ప్రార్థనలు

by Prasad Jukanti |

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఆధ్వర్యంలో బాపూ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

BC Reservations: బీసీ రిజర్వేషన్ అమలు కోసం బాపూ ఘాట్ వద్ద ప్రార్థనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుపై రాజకీయ పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లకు (Telangana BC Reservations) బీజేపీ, బీఆర్ఎస్సే అడ్డు తగులుతోందని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తుంటే, కాంగ్రెస్‍కు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే రిజర్వేషన్లకు అడ్డు ఏర్పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఇవాళ రాష్ట్ర బీసీ కమిషన్ (BC Commission) ఆధ్వర్యంలో బాపూ ఘాట్ (Bapu Ghat) వద్ద ప్రార్థనలు నిర్వహించారు. లంగర్ హౌస్ లోని బాపూ ఘాట్ వద్ద ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు బాపూ ఘాట్ వద్ద గాంధీజీ భజనలతో ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బి సి కమిషన్ చైర్మన్ నిరంజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, వీహెచ్, జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Next Story