ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు డీపీఆర్ రెడీ.. మరికాసేపట్లో సీఎం కీలక నిర్ణయం: ఉత్తమ్

by Prasad Jukanti |

ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరగనున్న నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశానికి ముందు కీలకమైన నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి సారించారు.

ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు డీపీఆర్ రెడీ.. మరికాసేపట్లో సీఎం కీలక నిర్ణయం: ఉత్తమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో హమీ మేరకు ఈ ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం చేశామన్నారు. ఇవాశ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరగనున్న రివ్యూ మీటింగ్‍లో తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరగనున్న నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశానికి ముందు, కీలకమైన నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించి లక్షలాధి ఎకరాలకు సాగునీరు అందించేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నామన్నారు. తుమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామన్నారు. ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ హైదరాబాద్ సమిష్టిగా 4 ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పునరుద్ధరణకు అవసరమైన పరీక్షలను వచ్చే వర్షకాలం సీజన్ లోపు పూర్తిచేసేలా చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రతి 1.5 మీటర్ దూరంలో ఎస్పీటీ టెస్టులు, 3 మీటర్ల పెర్మిబులిటీ టెస్టులు జరపనున్నామన్నారు. బ్యారేజీల పునరుద్ధరణ కోసం నియమించిన సమన్వయ కమిటీ సందర్శన టైమ్ లైన్‍ను ఫిక్స్ చేసుకోవాలన్నారు.

Next Story