ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావు కస్టడీ వారం పాటు పొడిగింపు.. సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక

by Ramesh Naini |

ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు మరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన నిందితుడిగా పేర్కోన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ వారం పాటు పొడిగింపు ఇస్తున్నట్లు ఆదేశాలలో పేర్కోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావు కస్టడీ వారం పాటు పొడిగింపు.. సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు మరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన నిందితుడిగా పేర్కోన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ వారం పాటు పొడిగింపు ఇస్తున్నట్లు ఆదేశాలలో పేర్కోంది. ఇంటిరియ్ ప్రోటెక్షణ్ రద్దు చేస్తూ వారం రోజుల పాటు సిట్ కస్టడికి ఇస్తూ 11వ తేదీ ఆదేశాలు జారీ చేసింది. 18వ తేదీ వరకు విచారించిన సిట్ బృందం విచారణ నివేదికను శుక్రవారం సుప్రీంకోర్టుకు అందజేసింది. నివేదికలో ప్రభాకర్ రావు సహకరించలేదని సిట్ బృందం పేర్కొనడంతో మరో వారం రోజుల పాటు కస్టడీ విచారణ పొడిగించింది.

ఈ నెల 25వ తేదివరకు జూబ్లి హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రభాకర్ రావును సిట్ బృందం విచారరిచనుంది. సిట్ విచారణకు సహకరించాలని ధర్మాసనం మరోసారి ఆదేశాల్లో పేర్కొంది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో నూతన సిట్ బృందాన్ని డీజీపీ శివధర్ రెడ్డి గురువారం ప్రకటించారు. రామగుండం సీపీ అంబర్ కిషోర్ జాను విచారణ అధికారిగా 9 మంది అధికారులతో సిట్ బృందాన్ని నియమించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక ఆధారాలుగా భావిస్తున్న ప్రభాకర్ రావు స్టేట్మెంట్ , ఆయన ఐ ఫోన్ , లాప్ టాప్ , ఐ క్లౌడ్ పాస్ వార్డులను రాబట్టేందుకు సిట్ బృందం వారం రోజుల పాటు విచారించనున్నట్లు తెలుస్తోంది.

Next Story