- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PHONE TAPPING CASE: ఇంటరాగేషన్ ఇంకెంత కాలం? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో సంచలనవ సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone tapping case) ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు (Prabhakar Rao) బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్‌రావు ఇంటరాగేషన్ ఇంకెంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటికే ఆయన్ను రెండు వారాలకు కస్టడీకి అనుమతించామని, ఇంకా అదనపు విచారణ అవసరంలేదని వ్యాఖ్యానించింది. ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్‍పై ఇవాళ సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభాకర్‌రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం తరఫున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. దీంతో ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆయన్ని పిలవకుండా ఉండలేరు కదా..? మీ పర్పస్ పూర్తయిందా లేదా? ప్రభాకర్‌రావును మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా..? అని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. అయితే ఈ కేసు దర్యాప్తులో న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయని, ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.






