- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారం అంటే మాకు హోదా కాదు.. బాధ్యత: భట్టి విక్రమార్క
పిప్రీ సభలో మాట్లాడిన భట్టి విక్రమార్క హామీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. పిప్రి నుంచి మొదలు పెట్టిన పీపుల్స్ మార్చి ద్వారా రాష్ట్రంలోని ప్రజల సమస్యలు తెలుసుకున్నామని చెప్పారు. అధికారం అంటే హోదా కాదు మాకు బాధ్యత అన్నారు. ఇన్ని పథకాలు, హామీలు ఎలా అమలు చేయగలుగుతున్నారని ఇతర రాష్ట్రాల నేతలు అడుగుతున్నారన్నారు. ఈ రాష్ట్రంలో పుట్టడం అదృష్టంగా ప్రజలు భావించే పరిస్థితులు ఉండాలని భావించామని ఆ దిశగానే పాలన సాగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి వర్తించేలా రూ. 5 లక్షల ఇందిరమ్మ బీమా పథకం తీసుకువచ్చామన్నారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రి బహిరంగ సభలో ప్రసంగించిన భట్టి విక్రమార్క.. 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశామన్నారు. ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. సామాజిక అంతరాలు లేని సమాచాన్ని నిర్మించేందుకే రాష్ట్రవ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. నాడు పిప్రీ నుంచి మొదలైన పాదయాత్ర, నాటి పీసీసీ చీఫ్ హోదాలో నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని భట్టి స్పష్టం చేశారు. ఆదాయం సృష్టించి దాన్ని ప్రజలకే పంచుతామ్నారు.






