TG: చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన మున్సిపాలిటీలు ఇవే

by Prasad Jukanti |

తెలంగాణలో వివిధ కారణాలతో పలు మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక వాయిదా పడ్డాయి.

TG: చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన మున్సిపాలిటీలు ఇవే
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మేయర్, చైర్మన్ ఎన్నికల సరవత్తరంగా సాగాయి. పలు చోట్ల ఉద్రిక్తల నడుమ ఈ ఎన్నికలు జరుగగా మరికొన్ని చోట్ల వివిధ కారణాలతో వాయిదా (Chairman Elections Post pone) పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపల్ కార్పొరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఇవాళ ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటిలో 11 మున్సిపాలిటీల్లో ఈ ఎన్నికలు వాయిదా పడినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలలో ఎన్నిక పోస్ట్ పోన్ అయినట్లు తెలిపారు. ఈ ఎన్నికలు రేపు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story