- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ponnam: కవిత లాంటి వారితో కూర్చుని మీ విలువ తగ్గించుకోవద్దు.. ఆర్.కృష్ణయ్యకు మంత్రి పొన్నం కౌంటర్
కవిత, ఆర్.కృష్ణయ్యపై మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ బిల్లుకు రాజకీయ రంగు పులమడం సరికాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి బీసీల గురించి మాట్లాడని ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) ఇప్పుడు బీసీలు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, మా ప్రభుత్వం బీసీ బిల్లును అసెంబ్లీలో అమోదింపచేసుకుని గవర్నర్ కు పంపినట్లు ఆయన గుర్తు చేశారు. బడుగుల పట్ల రాజకీయాలకు అతీతంగా కలిసిరావాలని పిలుపునిచ్చారు.
కృష్ణన్న మీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు:
బలహీన వర్గాల కోసం విద్యార్థి ఉద్యమాలు చేపట్టిన పెద్దన్న, ఎంపీ ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) అంటే మాకంతా గౌరవం ఉందని, పదేళ్లు అధికారంలో ఉండి బీసీలకు న్యాయం చేయని కవిత వంటి వారితో కూర్చుని మీ గౌరవాన్ని తక్కువ చేసుకోవద్దని అన్నారు. కేంద్రానికి బీసీ బిల్లును పంపించామని దాన్ని ఆమోదింపజేసుకునేందుకు ఆర్. కృష్ణయ్య ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ తీసుకోవాలని మోడీని అందరం కలుద్దామన్నారు. కవిత చేపట్టిన బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలన్న ఆర్.కృష్ణయ్య పిలుపుకు మంత్రి పొన్నం ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు.






