- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోళ్ల ఫారాలు, మూతపడిన రైస్ మిల్లులో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
బీఆర్ఎస్ హయాంలో అనేక రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టామని గొప్పలు చెప్పారని, ఆ స్కూళ్లు అన్నీ కోళ్ల ఫారాలు, మూతపడిన రైస్ మిల్లుల్లో పెట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ హయాంలో అనేక రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టామని గొప్పలు చెప్పారని, ఆ స్కూళ్లు అన్నీ కోళ్ల ఫారాలు, మూతపడిన రైస్ మిల్లుల్లో పెట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఆనాడు హాస్టళ్లలో వసతులు సరిగ్గా లేవని, కనీసం ఆహారం కూడా సరిగ్గా పెట్టలేదని మండిపడ్డారు. అక్కడక్కడా రెసిడెన్షియల్ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ అయ్యిందని, వసతులు సరిగ్గా లేవని అవాక్కులు చవాక్కులు చేస్తున్నారని ఈ పరిస్థితి మీ వల్ల కాదా అని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. 10 సంవత్సరాల మీ పరిపాలన వల్ల కాదా అని మండిపడ్డారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి నిసిగ్గుగా వేధికలపై నేడు అధికారంలో ఉన్న పార్టీని విమర్శిస్తున్నారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ponguleti






