Ponguleti: రేపటి అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |

ఆర్‌వోఆర్ చట్టం(ROR Act)లో మార్పులు చేశామని, రేపటి అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టాన్ని ఆమోదింపజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Revenue Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు.

Ponguleti: రేపటి అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్‌వోఆర్ చట్టం(ROR Act)లో మార్పులు చేశామని, రేపటి అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టాన్ని ఆమోదింపజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Revenue Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ వ్యవస్థ(Revenue System)పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడక ముందు దాదాపు 2 లక్షల 45 వేల అప్లికేషన్లు పెండింగ్ లో ఉండేవని, వారికి ఇష్టం వచ్చినట్టు అప్లికేషన్లు రిజెక్ట్ చేసేవారని, తాను మంత్రి అయ్యాక రద్దు చేసే ప్రతీ అప్లికేషన్ కు భూ యజమానికి కారణం తెలియజేయాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు విమర్శలు మొదలు పెట్టారని, ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఇక కమిటీ నివేదిక ఆధారంగా ధరణి(Dharani) ఎలా ప్రక్షాళన చేయాలో చూస్తున్నామని, రైతులకు మంచి జరిగే ప్రతీ సూచన స్వీకరిస్తామని స్పష్టం చేశారు.

అలాగే మా ప్రభుత్వం వచ్చాక ధరణిలో కొన్నిమార్పులు చేశామని, ధరణి యాప్ అందరికీ అర్థం అయ్యేలా మార్పలకు శ్రీకారం చుట్టామని, ధరణి నిర్వహణనను ఈ నెల ఒకటి నుంచి వీదేశీ సంస్థ నుంచి ఎన్ఐసీ(NIC)కి మార్చామని తెలిపారు. 2020 ఆర్‌వోఆర్ చట్టంలో లోపాలు సరిచేసి, 2024 ఆర్ వోఆర్ కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నామని, వచ్చే అసెంబ్లీ సమావేశాలలో(Assembly Meetings) కొత్త చట్టాన్ని ఆమోదింపజేస్తామని చెప్పారు. ధరణి కొత్త యాప్, కొత్త చట్టం సామాన్యులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. గత ప్రభుత్వం వీఆర్వో(VRO) వ్యవస్థను రాత్రికి రాత్రే రద్దు పరిచిందని, కానీ రెవెన్యూ గ్రామాలకు(Revemnue Village) ఓ అధికారి ఉండాలని స్థానికులు కోరుకుంటున్నారని అన్నారు. 2004-14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల ఇళ్లు నిర్మించిందని, 2014-23 వరకు 1.52 లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లకు టెండర్లు మాత్రమే పిలిచారని, వీటిలో 63 వేల ఇండ్లు పూర్తి అయ్యాయని, ఇందులో పింక్ కలర్ షర్ట్ తొడుకున్న వారికే ఎక్కువగా ఇచ్చారని విమర్శించారు.

గత ప్రభుత్వంలో మొదలై అసంపూర్తిగా ఉన్న ఇండ్లు ఇందిరమ్మ రాజ్యంలో యుద్ధప్రాతిపదికన రాబోయే ఒక నెల లేదా రెండు నెలల్లో కంప్లీట్ చేస్తామన్నారు. వీటిని అర్హులైన పేదవారికే ఇస్తామని స్పష్టం చేశారు. సంక్రాంతి లోపే ఇవన్నీ కంప్లీట్ చేసి ఇస్తామని అన్నారు. మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల స్థలాలు ఉన్న వారికోసం 4 లక్షల 50 వేల ఇండ్లు, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు తగ్గకుండా ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా ఇచ్చామన్న. ప్రతి ఇంటికి రూ. 5 లక్షల చొప్పున 400 చదరపు అడుగులు ఉండే విధంగా.. అంతకంటే ఎక్కువగా ఉన్న వారికైన సరే నచ్చిన డిజైన్‌లో ఒక టాయిలెట్, ఒక కిచన్‌తో పాటు ఇంటి నిర్మాణం వారి ఆర్థిక స్థోమత ప్రకారం కట్టుకోవచ్చని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అభివృద్దిని తాము చేసి చూపించినందుకే మాపై విష ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Thalli Statue) పైన కూడా బీఆర్ఎస్(BRS) రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక త్వరలో సర్వే వ్యవస్థను పటిష్టం చేయబోతున్నామని, ఇందుకోసం 1000 సర్వేయర్ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు.

Next Story