తెలంగాణ అస్తిత్వం.. పార్టీల ప్రస్థానం: ఆ పేరుతో ఇప్పటివరకు వచ్చిన పార్టీలివే!

by Gantepaka Srikanth |

ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష పురివిప్పుకున్న నాటి నుండి నేటి వరకు ‘తెలంగాణ’ అనే సెంటిమెంట్‌తో రాష్ట్ర రాజకీయాల్లో అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి.

తెలంగాణ అస్తిత్వం.. పార్టీల ప్రస్థానం: ఆ పేరుతో ఇప్పటివరకు వచ్చిన పార్టీలివే!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష పురివిప్పుకున్న నాటి నుండి నేటి వరకు ‘తెలంగాణ’ అనే సెంటిమెంట్‌తో రాష్ట్ర రాజకీయాల్లో అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ఉద్యమ గడ్డపై అట్టహాసంగా ప్రారంభమైన ఈ పార్టీలలో కొన్ని చరిత్ర సృష్టించగా, మరికొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. తాజాగా ‘తెలంగాణ రాష్ట్ర సేన’తో కవిత రాజకీయ అరంగేట్రం చేస్తున్న నేపథ్యంలో, గత పార్టీల ప్రస్థానంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇప్పటివరకు పురుడుపోసుకున్న పార్టీల వివరాలు:

వీరితో పాటు ప్రజా యుద్ధనౌక గద్దర్ నేతృత్వంలో ‘తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్’, విమలక్క సారథ్యంలో ‘తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్’ వంటి వేదికలు కూడా అస్తిత్వ పోరాటంలో భాగమయ్యాయి. ఇటీవల వైఎస్ షర్మిల ‘YSR తెలంగాణ పార్టీ’ని స్థాపించి, ఆపై కాంగ్రెస్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే.

సక్సెస్ రేటు తక్కువేనా?

తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుత BRS) మినహా, తెలంగాణ పేరుతో వచ్చిన మిగిలిన పార్టీలు ఎన్నికల రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. దేవేందర్ గౌడ్, విజయశాంతి వంటి సీనియర్ నేతలు తమ పార్టీలను ఉనికిలో ఉంచుకోలేక చివరకు ప్రధాన పార్టీలలో విలీనం చేశారు. కోదండరాం వంటి మేధావులు స్థాపించిన TJS సైతం కేడర్‌ను నిర్మించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. అట్టహాసంగా ప్రారంభమైనా.. నిలకడ లేని వ్యూహాలు, ఆర్థిక వనరుల కొరత, లేదా ప్రధాన పార్టీల ఆకర్షణ మంత్రంతో ఈ చిన్న పార్టీలు తెరమరుగయ్యాయి.

ఇప్పుడు అందరి దృష్టి ‘తెలంగాణ రాష్ట్ర సేన’పైనే!

ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో కొత్త రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. గతంలో వచ్చిన పార్టీల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈ పార్టీ ఏ మేరకు నిలదొక్కుకుంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు బలమైన జాతీయ పార్టీలు, మరోవైపు స్థిరపడిన ప్రాంతీయ శక్తుల మధ్య కవిత తన పార్టీని ఎలా సక్సెస్ చేస్తారో చూడాలి. తెలంగాణ రాజకీయాల్లో ‘పేరు’ సెంటిమెంట్ పని చేస్తుందా? లేక కొత్త వ్యూహాలతో ప్రజల మనసు గెలుచుకుంటారా? అన్నది కాలమే నిర్ణయించాలి.

Next Story