TG: కేటీఆర్, లోకేశ్ సీక్రెట్ భేటీపై తెలంగాణలో పొలిటికల్ హీట్

by Prasad Jukanti |

కేటీఆర్, లోకేశ్ సీక్రెట్ భేటీపై తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.

TG: కేటీఆర్, లోకేశ్ సీక్రెట్ భేటీపై తెలంగాణలో పొలిటికల్ హీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికలు మరో వైపు ఏపీతో నీటి వివాదాలతో పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కేటీఆర్ ఏపీ మంత్రి నారా లోకేశ్ తో సీక్రెట్ గా భేటీ (KTR Lokesh secret meeting) అయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ స్టేట్ పాలిటిక్స్ ను కుదిపేశాలా మారాయి. నిజానికి కేటీఆర్ లోకేశ్ మధ్య మంతనాల విషయాన్ని గత వారమే పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించగా ఇవాళ ఇదే విషయాన్ని సీఎం ప్రస్తావించారు. అయితే ఏకంగా మూడు సార్లు ఈ నేతలిద్దరు సమావేశం అయ్యారని ఆ భేటీ సీక్రెట్ ఏంటంటూ ప్రశ్నించారు.

బీఆర్ఎస్ స్పీడ్ వెనుక రీజన్ ఇదేనా?:

ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోకేశ్ తో భేటీ కావడం వెనుక మతలబు ఏంటనేది ప్రస్తుతం చర్చగా మారింది. ఓ వైపు వీరి మధ్య రహస్య సమావేశాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్న తరుణంలోనే మరో వైపు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ బై పోల్ పో స్పీడ్ పెంచింది. వరుసగా ఆ సెగ్మెంట్ నేతలతో అగ్రనేతల సమావేశాలు నిర్వహించడం ఇప్పుడు సందేహాలకు తావిస్తోంది. ఇటీవలే గులాబీ బాస్ కేసీఆర్ తో కేటీఆర్, హరీశ్ రావు భేటీ అయ్యారు. ఈ మీటింగ్ లో జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగినట్లు ప్రచారం జరిగింది. అయితే రాష్ట్రంలో మిగతా పార్టీలకంటే ముందే బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పై నజర్ వేయడం, లోకేశ్ తో కేటీఆర్ భేటీ అంటూ లీకులు రావడం వెనుక ఏదో సంబంధం ఉందనే చర్చ జోరుగా వినిపిస్తోంది. అయితే నిన్నా మొన్నటి వరకు ఈ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ వరకు మాత్రమే ఉండగా ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి సైతం ఇవే వ్యాఖ్యలు చేయడం పొలిటికల్ హీట్ ను పెంచుతోంది.

Next Story