గణపతి ప్రతిమల తరలింపు.. వారికి పోలీసుల హెచ్చరిక

by Muthe.Rajitha |

మరో మూడు రోజుల్లో జరగనున్న వినాయక చవితి ఉత్సవాలకు ఊరు వాడా సిద్ధం అవుతోంది.

గణపతి ప్రతిమల తరలింపు.. వారికి పోలీసుల హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్ : మరో మూడు రోజుల్లో జరగనున్న వినాయక చవితి ఉత్సవాలకు ఊరు వాడా సిద్ధం అవుతోంది. మండపాల ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇక గణపతి ప్రతిమల తరలింపు ప్రక్రియ కూడా ఊపందుకుంది. ప్రతిరోజూ కొన్ని వేల గణపతి ప్రతిమలు మండపాలకు తరలుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు పలు కీలక హెచ్చరికలు జారీ చేసారు. గణపతి ప్రతిమల తరలింపు విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ వేళలో విగ్రహాల తరలింపుతో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి వీలైనంత వరకు రాత్రి వేళల్లో ప్రతిమలను తరలించాలని తెలిపారు.

నిపుణులైన డ్రైవర్లను మాత్రమే విగ్రహాల తరలింపునకు ఎంచుకోవాలని, చిన్నారులను ఎట్టిపరిస్థితుల్లోనూ విగ్రహాల తరలింపులో భాగస్వాములను చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. అలాగే విద్యుత్ వైర్లు ఉన్న ప్రదేశాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లో విద్యుత్ వైర్లను జరపడానికి రాడ్ వంటి పరికరాలు ఉపయోగించకూడదని పోలీసులు సూచించారు. కాగా ఇటీవల వినాయక ప్రతిమలు తరలిస్తూ.. విద్యుత్ తీగలను పక్కకి జరుపుతుండగా కరెంట్ షాక్ కోటి ముగ్గురు వ్యక్తులు మరణించిన నేపథ్యంలో ఈ అలర్ట్స్ జారీ చేసారు పోలీసులు.

Next Story