Rakhi Effect: హయత్‌నగర్ దాటాక ఇబ్బందేమీ లేదు.. ట్రాఫిక్‌పై పోలీసుల ప్రకటన

by Gantepaka Srikanth |

గ్రేటర్ హైదరాబాద్‌ వ్యాప్తంగా ఎక్కడిక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్(Hyderabad Traffic) అయింది.

Rakhi Effect: హయత్‌నగర్ దాటాక ఇబ్బందేమీ లేదు.. ట్రాఫిక్‌పై పోలీసుల ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్‌ వ్యాప్తంగా ఎక్కడిక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్(Hyderabad Traffic) అయింది. రాఖీ పండుగ(Rakhi Festival), వీకెండ్ కావడంతో పెద్ద సంఖ్యలో ఊర్లకు వెళ్లేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో ఊహించని రేంజ్‌లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉప్పల్ - వరంగల్ హైవేపై, ఎల్లీనగర్ - విజయవాడ హైవేపై రోడ్లమీద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌పై పోలీసులు(Hyderabad Police) కీలక ప్రకటన చేశారు. ఉప్పల్, ఎల్బీనగర్‌, వనస్థలిపురం వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయని అన్నారు.

హయత్ నగర్‌ బస్టాండ్ వద్ద రోడ్డు చిన్నగా ఉందని.. అందుకే బస్టాండ్ వద్ద వాహనాలు నెమ్మదిస్తున్నాయని పేర్కొన్నారు. పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సులు పెరగడంతో పాటు ఆ బస్సులు వస్తూ వెళ్తున్న క్రమంలో ట్రాఫిక్ జామ్ అవుతోందని అన్నారు. హయత్ నగర్ దాటిన తర్వాత పెద్దగా ఇబ్బందేమీ లేదని వెల్లడించారు. పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి కాస్త సమయం పడుతుందని అన్నారు. పోలీసులంతా విధుల్లోనే ఉండి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నారని చెప్పారు.

మరోవైపు ఉప్పల్, అన్నోజిగూడ నుంచి ఘట్‌కేసర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అన్నోజీగూడ నుంచి ఘట్‌కేసర్ వెళ్లేందుకు 50 నిమిషాల వరకూ సమయం పట్టొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Next Story