- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: బీజేపీ నేత చీకోటి ప్రవీణ్‌పై కేసు నమోదు
బీజేపీ నేత చీకోటి ప్రవీణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ నేత చోకోటి ప్రవీణ్ కుమార్(BJP leader Chokoti Praveen Kumar)పై నల్గొండ వన్ టౌన్ పోలీసులు(Nalgonda One Town Police) కేసు నమోదు చేశారు. శనివారం హనుమాన్ జయంతి(Hanuman Jayanti) సందర్భంగా నగరంలో స్థానిక బీజేపీ నేతలు(BJP leaders) శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో చీకోటి ప్రవీణ్ పాల్గొన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు, స్థానిక హనుభక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
అయితే చీకోటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు సుమోటోగా తీసుకున్నారు. చీకోటిపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా చీకోటిని త్వరలో విచారణకు పిలిచే అవకాశం ఉంది. మరోవైపు పోలీసుల తీరును స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు తప్పుబడుతున్నారు. నల్గొండలో హన్‌మాన్ శోభాయాత్ర చాలా పీస్‌పుల్‌గా జరిగిందని, చీకోటి ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని అంటున్నారు. చీకోటిపై నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






