ధర్మపురంలో ఉద్రిక్తత.. 144 సెక్షన్ విధింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-14 16:14:51  IST  )

నల్గొండ జిల్లా ధర్మపురంలో పోలీసులు 144 సెక్షలు విధించారు..

ధర్మపురంలో ఉద్రిక్తత.. 144 సెక్షన్ విధింపు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో రెండో విడత పంచాయతీ ఎన్నికల(Panchayat Elections) ఫలితాలు(Results) విడుదల కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అభ్యర్థులు, అధికారుల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. దీంతో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం ధర్మపురంలో తీవ్ర గందరగోళం నెలకొంది. కౌంటింగ్ హాలు నుంచి గోడ దూకి బ్యాలెట్ పేపర్లు అపహరించారనే ఆరోపణలు చెలరేగాయి. దీంతో కౌంటింగ్ కేంద్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ మేరకు బీఆర్ఎస్, రెబల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు కౌంటింగ్ నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళనను అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ మేరకు ధర్మపురం గ్రామంలో ఉద్రిక్తత చేసుకుంది. ఈ నేపథ్యంలో గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అనుమతి లేని వాళ్లు, గుంపులు, గుంపులుగా ఎవరూ ఉండొద్దని హెచ్చరించారు.

Next Story