మెస్సీ మ్యాచ్ వేళ.. ఉప్పల్ స్టేడియం వద్ద మీడియాతో పోలీసుల వాగ్వాదం!

by Ramesh Naini |   (  Updated:2025-12-13 12:58:01  IST  )

మెస్సీ మ్యాచ్ వేళ.. ఉప్పల్ స్టేడియం వద్ద తాజాగా పోలీసులు మీడియాతో వాగ్వాదానికి దిగారు.

మెస్సీ మ్యాచ్ వేళ.. ఉప్పల్ స్టేడియం వద్ద మీడియాతో పోలీసుల వాగ్వాదం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెస్సీ మ్యాచ్ వేళ.. ఉప్పల్ స్టేడియం వద్ద తాజాగా పోలీసులు మీడియాతో వాగ్వాదానికి దిగారు. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియానికి మీడియా కవరేజ్ చేయడానికి వచ్చింది. అయితే పోలీసులు సాయంత్రం టైమ్‌లో మీడియాను అనుమతించ లేదని తెలుస్తోంది. లోపలికి పంపాలని పోలీసులతో మీడియా ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. దీంతో జర్నలిస్టులు ఆర్గనైజర్లపై అగ్రం వ్యక్తం చేశారు. మీడియా ఎంట్రీ పాస్‌లు ఉన్న తమను పంపించడం లేదని జర్నలిస్టులు వాపోయారు. ఇక, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇవాళ రాత్రి 7:50 గంటలకి ఉప్పల్‌ స్టేడియంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. రాత్రి 8:06 గంటలకి సీఎం రేవంత్‌రెడ్డి, మెస్సీ మైదానంలోకి దిగనున్నారు. రాత్రి 8:18కి మైదానంలోకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ దిగనున్నారు. వీడియో ఇదే..

Next Story